రాష్ట్రవ్యాప్తంగా అడవులు పునరుద్దరణ:కేసీఆర్

గజ్వేల్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అటవీభూముల్లో అడవుల పునరుద్దరణకు ప్రణాళిక రూపొందించి, కార్యాచరణ ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. సామాజిక అడవుల పెంపకం, ఆవాస ప్రాంతాల్లో ఉ ష్ణోగ్రతలు తగ్గించడానికి ఉపయోగపడితే.. అడవుల పెంపకం వెత్తం వాతావరణంలోనే మార్పు తెస్తుందని, వర్షాలు బాగా కురవడానికి జీవ వైవిధ్యానికి దోహద పడుతుందన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగాపల్లి, నేంటూరు, కోమటిబండ తదితర ప్రాంతాల్లో చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులను జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి స్వయంగా చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంలా గజ్వేల్ నియోజకవర్గంలోని అటవీ భూములు చెట్లులేని ఎడారుల్లా మారిన దుస్థితి ఉండేదన్నారు. అటవీ భూముల్లో అడవిని పునరుద్ధరించాలనే లక్ష్యంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేసినట్లు వెల్లడించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన పునరుద్ధరణ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని సీఎం చెప్పారు. ప్రాంతమంతా పచ్చని చెట్లతో కళకళలాడుతోందని, వర్షపాతం కూడా పెరిగిందన్నారు. 27 రకాల పండ్ల మొక్కలను కూడా ఈ అడవుల్లో పెంచడంతో అవి వంకీ వుడ్ కోరల్లా తయారవుతున్నాయని చెప్పారు. గజ్వేల్ అటవీభూమి ఉన్నప్పటికీ అదే నిష్పత్తిలో అడవులు లేవని చెప్పారు. గజ్వేల్ అటవీప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్దరణ కార్యక్రమాన్ని అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, అడిషనల్ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ కలెక్టర్లకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ ను ఉపయోగించుకొని అడవుల్లో సహజమైన కోమటిబండలో పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని చెప్పారు. బయటి జంతువులు లోపలకు రావడం.. లోపలి జంతువులు బయటకు రావడం.. లోపలి జంతువులు బయటకు వెళ్లడం సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావాల్సిన తేమ అందుతోందని వివరించారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతోందని.. ఉష్ణోగ్రతలు కూడా తగ్గి, వర్షపాతం పెరుగుతుందన్నారు. దీంతో జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారులు కలెక్టర్లకు వివరించారు. ఉన్న అడవులను కాపాడుకోవాలని.. అందులో మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాల సీఎం సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఈ బాధ్యత తీసుకోవాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయండి అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సందర్శించిన అనంతరం కలెక్టరు కోమటిబండలో నిర్మించిన మిషన్ భగీరథ ప్లాంటును సందర్శించారు. అక్కడే కలెక్టర్లతో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత కలెక్టర్లతో సమావేశమయ్యారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం అ కలెక్టర్లతో సీఎం చర్చించారు. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, దీనికి అనుగుణంగా 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కోరారు.